విజయ్ మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

ముంబై: దేశంలోని పలు బ్యాంకులకు వందల కోట్ల రుణం ఎగవేశారని ఆరోపణలెదుర్కొంటున్న లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అంథేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఈ వారెంట్ జారీ చేస్తున్నట్టు పేర్కొంది. కాగా, బ్యాంకులకు రుణం ఎగవేసిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనను భారత్‌కు రప్పించేందుకు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య