వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో నామినేషన్ల వివరాలు

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్, కోడంగల్ నియోజకవర్గాల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు 138 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లాలో అత్యధికంగా వికారాబాద్ లో 21 మంది అభ్యర్థులు 44 సెట్లు, అత్యల్పంగా పరిగిలో 14 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లను వేశారు. తాండూర్ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు 34 సెట్ల నామినేషన్లు వేశారు. కొడంగల్ నియోజకవర్గంలో 21 మంది అభ్యర్థులు 37 సెట్ల నామినేషన్లు వేశారు.

అదేవిధంగా మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల్లో మొత్తం 31 మంది అభ్యర్థులు 56 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో మెదక్ శాసనసభ స్థానానికి 19 మంది అభ్యర్థులు 32 నామినేషన్లు దాఖలు చేయగా..నర్సాపూర్ శాసనసభ స్థానానికి 12 మంది అభ్యర్థులు 24 నామినేషన్లు దాఖలు చేశారు. వనపర్తి నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లు వేశారు. కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 49 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Related Stories: