ఈ నెల 24న విడుదల కానున్న నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన నోకియా స్మార్ట్‌ఫోన్ నోకియా 5.1 ప్లస్‌ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.

నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు...

5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related Stories: