ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్6 ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో విడుదల కాగా త్వరలో భారత్‌లోనూ లభ్యం కానుంది. ఇందులో 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో డ్యుయల్ వీవోఎల్‌టీఈ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉన్న రెండు సిమ్‌లను ఒకేసారి వేసుకుని రెండింట్లోనూ ఒకేసారి 4జీ సేవలను పొందవచ్చు. ఇక ఈ ఫోన్‌లో అమర్చిన బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ ఫోన్ సున్నా నుంచి 50 శాతం వరకు చార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్, సిల్వర్ రంగుల్లో 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,830, రూ.15,980, రూ.18,090 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. నోకియా ఎక్స్6 ఫీచర్లు... 5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.
× RELATED ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి