సమయం లేదు మిత్రమా!

నోయల్, ట్వింకిల్ సౌజ్ జంటగా నటించనున్న తాజా చిత్రం సమయం లేదు మిత్రమా. ఎమ్.వరప్రసాద్ దర్శకుడు. కె.వి.ప్రొడక్షన్స్ పతాకంపై జి.ఎమ్. మురళీధర్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఇదొక కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్. మంచి టెక్నీషియన్స్ కుదిరారు. సరికొత్త కథతో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. త్వరలో చిత్రాన్ని ప్రారంభించి రెగ్యలర్ షూటింగ్‌ని మొదలుపెడతాం అన్నారు. నోయల్ మాట్లాడుతూ టైటిల్‌నిబట్టే సినిమా ఎలా వుండబోతుందనేది అర్థమవుతుంది. నటుడిగా నా కెరీర్‌కు ప్లస్ అయ్యే సినిమా ఇది. పాటలు బాగా కుదిరాయి అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కోలా నవీన్, కెమెరా: ప్రవీణ్. కె. కావలి, సంగీతం: అజయ్ పట్నాయక్, స్టంట్స్: దేవరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మాంచాల కిషన్, సహనిర్మాతలు: చల్లా మహేష్, అశోక్‌గౌడ్.