పంజాబ్‌లోని ఆ ఊరికి ఇంకా కరెంట్ లేదు!

పంజాబ్: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రస్తుతం కరెంట్ వెలుగులు జిమ్ముతున్నదని రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని.. అమృత్‌సర్‌కు సమీపంలోని ఇందిరా నగర్ అనే ఏరియా ప్రజలకు కరెంట్ అంటేనే తెలియదు. వాళ్లకు కనీసం నీటి కనెక్షన్ కూడా లేదు. దీంతో ఆ ఊరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. "పిల్లలు చదవడానికి సమస్యగా మారింది. సాయంత్రం దాటితే ఊరు ఊరంతా చీకట్లో మగ్గాల్సిందే. మండు వేసవిలోనూ వేడిని భరించాల్సిందే తప్పితే.. మాకు ఫ్యాన్లు, కూలర్లు గట్రా ఉండవు కదా. ఎన్ని సార్లు అధికారులకు మా సమస్యలను విన్నవించినా పట్టించుకున్న నాథుడు లేడు.." అంటూ వాపోతున్నారు ఊరు జనాలు.

Related Stories: