సుఖోయ్ త‌ర్వాత యుద్ధ విమానాల‌నే కొన‌లేదు..

న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ సాగింది. ఎయిర్ వైస్ మార్ష‌ల్ చ‌ల‌ప‌తి.. చీఫ్ జ‌స్టిస్ గ‌గోయ్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. భార‌త వైమానిక ద‌ళంలోకి వ‌చ్చిన సుఖోయ్‌-30 యుద్ధ విమానాన్ని చిట్ట‌చివ‌రి సారిగా కొనుగోలు చేశామ‌ని ఎయిర్ మార్ష‌ల్ చ‌ల‌ప‌తి తెలిపారు. ఆ త‌ర్వాత కొత్త యుద్ధ విమానాలు వైమానిక ద‌ళంలో చేర‌లేద‌ని, భార‌త్‌కు 4 ప్ల‌స్ జ‌న‌రేష‌న్‌కు సంబంధించిన విమానాలు అవ‌స‌ర‌మ‌ని, అందుకే రాఫెల్ జెట్‌ను ఎంపిక చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ఈస్ట్ర‌న్ ఎయిర్ క‌మాండ్ చీఫ్ అలోక్ ఖోస్లా, డిప్యూటీ చీఫ్ వీఆర్ చౌద‌రి కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. వైమానిక ద‌ళంలో నాలుగ‌వ‌, అయిద‌వ జ‌న‌రేష‌న్‌కు సంబంధించిన యుద్ధ విమానాలు లేవ‌ని వారు కోర్టుకు విన్న‌వించారు. 1985 నుంచి వైమానిక ద‌ళంలో కొత్త యుద్ధ విమానాలు చేరలేదా అన్న ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇచ్చారు. ఒక‌వేళ కార్గిల్ యుద్ధ స‌మ‌యంలో రాఫెల్ యుద్ధ విమానం ఉండి ఉంటే.. ప్రాణ న‌ష్టం ఇంత భారీగా ఉండేది కాదు అని అటార్నీ జ‌న‌ర‌ల్ వేణుగోపాల్ అన్నారు. టార్గెట్‌ను సుమారు 60 కిలోమీట‌ర్ల దూరం నుంచి కూడా రాఫెల్ కొట్ట‌గ‌ల‌ద‌ని ఆయ‌న తెలిపారు. రాఫెల్ కొనుగోలు అంశంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని వ‌చ్చిన పిటిష‌న్ల కేసులో సుప్రీం త‌న తీర్పును రిజ‌ర్వ్ చేసింది.

Related Stories: