సమైక్యపాలనలో అభివృద్ధికి నిధులు కేటాయించలే..

రాజన్న సిరిసిల్ల: ముస్తాబాద్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగసభకు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ హాజరయ్యారు. సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..సమైక్య పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. నిధుల కేటాయింపులో అడుగడుగునా వివక్ష చూపించారన్నారు. నాలుగేళ్లలో సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు తీయిస్తున్నాం. డిసెంబర్ 11 తర్వాత పెన్షన్లన్నీ రెట్టింపు అవుతాయని కేటీఆర్ వెల్లడించారు. పేదల సంక్షేమం కోసం బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. పెన్షన్ తీసుకునే వయస్సును 58 ఏళ్లకు తగ్గిస్తున్నామని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Stories: