ఆ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవడం లేదు..

బాక్సాపీస్ వద్ద షారుక్‌ఖాన్, రణ్‌వీర్ సింగ్ సినిమాల మధ్య బిగ్ ఫైట్ జరుగనుందని వచ్చిన వార్తలను బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కొట్టిపారేశాడు. తాను దర్శకత్వం వహించిన సింబా, షారుక్‌ఖాన్ నటించిన జీరో చిత్రాలు ఒకే రోజు విడుదలవడం లేదని రోహిత్ శెట్టి చెప్పాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. రణ్‌వీర్ సింగ్ చిత్రం డిసెంబర్ 28న వస్తోంది. రెండు సినిమాల మధ్య వారం సమయం ఉంటుంది. అందువల్ల ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ ఎలా ఉంటుంది. తొలుత రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావాల్సి ఉంది. రెండు ప్రాజెక్టులు ఒకేసారి విడుదల కావడం వల్ల బిజినెస్ పరంగా నష్టం వచ్చే అవకాశమున్న నేపథ్యంలో..కరణ్‌జోహార్, షారుక్‌ఖాన్‌తో ఈ విషయమై చర్చించాను. విడుదల తేదీ మార్పు చిన్న విషయం. ఏ సినిమా అయిన బాగుంటే ఖచ్చితంగా ఆడుతుందని చెప్పాడు రోహిత్ శెట్టి. టెంపర్ రీమేక్‌గా వస్తున్న సింబా చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా సైఫ్‌అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ నటిస్తోంది.

Related Stories: