టంగ్‌స్టన్‌పై ఎన్‌ఎండీసీ గురి

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్.. ఆస్ట్రేలియాలో టంగ్‌స్టన్ లోహం అన్వేషణ కోసం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి లైసెన్సుకు అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నది. ఈ మేరకు సంస్థ వర్గాలు పీటీఐకి తెలియజేశాయి. దేశీయ రక్షణ, విమానయాన రంగాలకు టంగ్‌స్టన్ అవసరం ఎంతగానో ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎండీసీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నదని సదరు వర్గాలు తెలిపాయి. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలోగల కింబర్లేలో టంగ్‌స్టన్‌తోపాటు, కాపర్, జింక్, బంగారం, ఇంకా ఇతరత్రా విలువైన ఖనిజ నిల్వలున్నట్లు గుర్తించిన ఎన్‌ఎండీసీ.. వాటి తవ్వకాల దిశగా వెళ్తున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోని ఎన్‌ఎండీసీ అనుబంధ సంస్థ లీగసి ఐరన్.. ఐరన్ వోర్, పసిడి, ఇతరత్రా ఖనిజాల కోసం తవ్వకాలను నిర్వహిస్తున్నది.

Related Stories: