నిధుల దుర్వినియోగం.. నిసాన్ చైర్మ‌న్ అరెస్టు

టోక్యో: నిసాన్ కార్ల సంస్థ చైర్మ‌న్ కార్లోస్ గోస‌న్ అరెస్టు అయ్యారు. కంపెనీ నిధులను దుర్వినియోగం చేసిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి కూడా ఆయ‌న్ను తొల‌గించారు. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం కంపెనీ సొమ్మును వాడిన‌ట్లు తెలుస్తోంది. జ‌పాన్‌కు చెందిన నిసాన్ మోట‌ర్ సంస్థ .. ఓ నివేదిక ఆధారంగా ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. కార్లోస్ తొల‌గింపు ఒకింత జ‌పాన్ ప్ర‌జ‌ల‌ను షాక్‌కు గురిచేసింది. దివాళా ద‌శ‌లో ఉన్న కంపెనీకి ఆయ‌నే మ‌ళ్లీ జీవం పోశారు. రినాల్ట్ సంస్థ‌కు కూడా కార్లోస్ సీఈవోగా ఉన్నారు.

Related Stories: