చెల్లెలి కొడుకుతో కాజ‌ల్‌.. ఫోటోలు వైర‌ల్‌

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా అ, ఎంఎల్ఏ అనే సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కులని అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన క్వీన్ కి రీమేక్‌గా పారిస్ పారిస్ అనే త‌మిళ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ర‌మేష్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అయితే కాజ‌ల్ సోదరి నిషా అగర్వాల్ న‌వంబ‌ర్ 27,2017న పండంటి బాబుకి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. నిషాకి బాబు పుట్ట‌డంతో కాజ‌ల్‌కి పెద్ద‌మ్మ ప్ర‌మోష‌న్ రాగా, వెంట‌నే ఆ బాబుని ముద్దాడుతూ ఫోజిచ్చిన ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ చెల్లెలి కుమారుడి పేరు ఇషాన్ వాలేచా అని నెటిజ‌న్స్‌కి ప‌రిచ‌యం చేసింది. ఖాళీ దొరికిన‌ప్పుడ్ల‌లా ఇషాన్‌తో స‌ర‌దాగా టైం స్పెంట్ చేస్తుంది. తాజాగా కాజ‌ల్‌, ఆమె సోద‌రి, ఇషాన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఫోటోలో నిషా త‌న‌యుడు ఇషాన్ వాలేజా ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్నాడు. అభిమానులు ఆ బుడ‌త‌డిని చూసి తెగ‌ మురిసిపోతున్నారు. నిషా అగర్వాల్ .. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కరణ్‌ను 2013, డిసెంబర్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏమైంది ఈ వేళ, సోలో సినిమాలతో తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్న నిషా ఆ తర్వాత సరైన హిట్స్ సాధించలేకపోయింది. దీంతో పెళ్లి పీటలెక్కింది. పెళ్ళి త‌ర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది నిషా.

Related Stories: