అతడు యూకేలోనే ఉన్నాడు.. మాకు అప్పగించండి!

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ యూకేలోనే ఉన్నట్లు అక్కడి అధికారులు ఇండియాకు చెప్పారు. దీంతో అతన్ని తమకు అప్పగించాల్సిందిగా సీబీఐ.. యూకేను కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.13500 కోట్ల స్కాంలో నీరవ్ మోదీ, అతని అంకుల్ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నీరవ్ మోదీని అప్పగించాల్సిందిగా యూకేని కోరినట్లు ఈ నెల మొదట్లో ప్రభుత్వం కూడా పార్లమెంట్‌కు తెలియజేసింది. లండన్‌లోని ఇండియా హై కమిషన్‌కు ప్రత్యేక దౌత్యమార్గంలో ఈ వినతిని పంపించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంట్‌కు చెప్పారు. భారత్ ఇలా 2002 నుంచి 28 మందిని తమకు అప్పగించాల్సిందిగా యూకేను కోరింది. ఈ లిస్ట్‌లో తాజాగా నీరవ్ మోదీ కూడా చేరాడు. ఇందులో 16సార్లు భారత్ వినతిని యూకే తోసిపుచ్చింది. ఇప్పటికే విజయ్ మాల్యా అప్పగింత కేసు కూడా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Related Stories: