భారీ బందోబస్తు

పరకాల టౌన్, జనవరి 21: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని గణపతి కళాశాలలో చేపట్టిన పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి పోలీస్ సిబ్బందికి పోలింగ్ సమయంలో వ్యవహరించాల్సిన తీరును వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో ఏసీపీ స్థాయి అధికారితో ఎన్నికలను పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు చట్టానికి లోబడి ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలని పేర్కొన్నారు. లేనట్లుయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పీ శ్రీనివాస్, సీఐలు పింగిళి మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. 163 మందితో బందోబస్తు ఏసీపీ శ్రీనివాస్ పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 163 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నేడు పట్టణంలో11వార్డుల్లోని 22 పోలింగ్ స్టేషన్లలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక నిఘా పె ట్టా మన్నారు. బందోబస్తులో ముగ్గురు సీఐలు, ఆరుగురుఎస్సైలు, 11 మంది ఏఎస్సైలు, ఇద్దరు మాహిళా ఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు , 60 మంది కానిస్టేబుళ్లు, 11మంది మహిళా కానిస్టేబుళ్లు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిబ్బంది 17 మంది, 34 మంది హోంగార్డులు మొత్తం 163 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Related Stories:

More