పల్స్ పోలియో 100% పూర్తి

మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలో ఆదివారం ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమం మం గళవారం నాటికి వంద శాతం పూర్తయినట్లు డీఎంఅండ్ భీష్మ తెలిపారు. జిల్లా వ్యాప్తం గా జిల్లా ప్రధానాసుపత్రితో పాటు 17 పీహెచ్ నాలుగు యూహెచ్ మూడు సీహెచ్ పరిధి లో పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు 75,587 మంది పిల్లలు పల్స్ పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా మొదటి రోజు బూత్ 68,121 (90 శాతం) మంది పిల్లలకు చుక్కలు వేశారని పేర్కొన్నారు. రెండవ రోజు ఇంటింటికి తిరిగి 6305 మందికి, మూడో రోజు మంగళ వా రం మిస్సయిన 1256 మంది చిన్నారులకు పోలి యో చుక్కలు వేశారని తెలిపారు. దీంతో మూడు రోజుల్లో 75,682 (100.12 శాతం) మందికి వైద్య, ఆరోగ్య సిబ్బంది చుక్కలు వేశార న్నారు. ఇందుకు గానూ 5500 వాయిల్స్ 5045 వాయిల్స్ ఉపయోగించారని పేర్కొన్నారు.
More