రిటైర్డ్ కార్మికులకు శుభవార్త..

శ్రీరాంపూర్ : సింగరేణిలో పని చేసి 2018-19లో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఈ నెల 22న దీపావళి బోనస్, సింగరేణి లాభాల వాటా చెల్లించనున్నట్లు గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురెందర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని రిటైర్డ్ కార్మికులకు పీఎల్ బోనస్(దీపావళి), సంస్థ లాభాల వాటా 28 శాతం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. సింగరేణిలో 2550 మంది ఉద్యోగ విరమణ కార్మికులు ఆర్థిక లాభం చేకూరనుందని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలో రూ.23 కోట్లను కార్మికులు పొందనున్నారని చెప్పారు. రిటైర్డు కార్మికులు వారి బ్యాంకు కాతాల్లో జమ అయిన దీపావళి బోనస్, సంస్థ లాభాల వాటా ను పొందాలని కోరారు. కార్మికులకు త్వరగా బోనస్ ఇప్పించిన టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
More