టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనుభారీ మెజార్టీతో గెలిపించండి

చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ కోరారు. ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో చెన్నూర్‌లోని 6, 12, 17వ వార్డుల్లో పర్యటించారు. అలాగే పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమనీ, పనులు చేసే పార్టీకే పట్టంకట్టాలని కోరారు. ఇప్పటికే 7వార్డులు ఏకగ్రీవమయ్యాయనీ, మరో వార్డులో బీజేపీ అభ్యర్థి మద్దతు ఇస్తుండడంతో చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నట్లేనన్నారు. మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానాన్ని గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి మిగితా వార్డుల్లో కూడా ప్రజలు మద్దతు పలికి భారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులు మరింత అభివృద్ధి కావాలంటే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఏ పని కావాలన్నా టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ఇప్పటికే చెన్నూర్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రూ. 50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జలాల్‌ పెట్రోల్‌ బంకు నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు ప్రధాన రహదారిని వెడల్పు చేసి, డివైడ ర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. యువకలకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చేందుకు స్కిల్‌ డెవలప్‌మెం ట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో వంద పడకల దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.6కోట్లతో పెద్ద చెరువును మినీ ట్యాంకుబండ్‌గా నిర్మించనున్నట్టు తెలిపారు. రూ.3కోట్లతో ఆస్నాద్‌ రోడ్డులోని కుమ్మరికుంటను మినీ ట్యాంకుబండ్‌గా నిర్మిస్తున్నట్టు తెలిపారు. పట్టణంలో 300 డబు ల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మిస్తున్నట్టు అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వనున్నట్టు తెలిపారు. అందరం కలసికట్టుగా చెన్నూర్‌ను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. పార్టీ కన్న తల్లిలాంటిదని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, ద్రోహాం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 6వ వార్డు, 12వ వార్డు, 17వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సాధనబోయిన లావణ్య, వేముల శారద, నాయిని శ్యామలను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేయండి : ఎమ్మెల్సీ పురాణం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని చెప్పారు. చెన్నూర్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసుకునేందుకు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మహావాది సుధాకర్‌రావు, ఎంపీపీ మంత్రి బాపు, టీఆర్‌ఎస్‌ పార్టీ వార్డుల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
More