కాళేశ్వరంతో సస్యశ్యామలం

-ప్రతి చెరువుకూ గోదావరి జలాలు -సాగు నీటికి ఢోకాలేదు -అభివృద్ధి ప్రదాతను ఆశీర్వదించండి -ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ -వర్ధన్నపేటలో జోరుగా ప్రచారం వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : వలస పాలకుల వివక్షతతో ఎడారిగా మారిన తెలంగాణలోని ప్రతి చె రువులోకి గోదావరి జలాలను తరలించి పంట భూ ములను సస్యశ్యామలం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నా రు. వర్ధన్నపేట పట్టణంలోని 7, 12వ వార్డుల్లో అభ్యర్థులు పాలకుర్తి సుజాత, పూజారి సుజాతతో కలిసి శనివారం ఆయన ఇం టింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్‌ అనతికాలంలోనే రైతులకు 24గంటల ఉచిత మెరుగైన విద్యుత్‌ను అందించారన్నారు. మూడేళ్లలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం చి తెలంగాణలోని 30 జిల్లాలకు జలాలను మల్లించి సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు. అంతేకాక ఆసరా పింఛన్‌లు, రైతుబంధు, రైతుబీమా అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తోందన్నారు. ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటికీ ప్రభుత్వం రూ.35 కోట్ల మేరకు నిధులు మంజూరు చేయడంతో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈనెల 22న జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఆయన వెంట రైతు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ అ ప్పారావు, జెడ్పీటీసీ బిక్షపతి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, పాలకుర్తి సారంగపాణి, తూళ్ల కుమారస్వామి, తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, అల్లమనేని మోహన్‌రావు, ఎండీ రహీం పాల్గొన్నారు.

Related Stories:

More