ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలి

-అభివృద్ధి నిరోధకులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి -సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి -మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -టీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ బాగుంది: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట రూరల్‌, జనవరి 18: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకుల డిపాజిట్లు గల్లంతు చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం నర్సంపేట పట్టణం సర్వాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో గెలుపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులదే అన్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని పట్టణాలు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు. గత ఏడాదే మున్సిపల్‌ ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్‌ నేతలు కోర్డులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారని, దీంతో ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో 90శాతంపైగా గెలుపొందుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నర్సంపేటలోని ఏరియా దవాఖానను జిల్లా స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసి రూ.60కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో రూ.60 కోట్ల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. రూ.55కోట్లతో వెయ్యి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఎమ్మెల్యేగా గెలిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలో మరింత ముందుకు సాగుతోందన్నా రు. మరో రెండు నెలల్లో నర్సంపేట పట్టణ ప్రజలకు ఇంటింటికి పైపులైన్‌ ద్వారా వంట గ్యాస్‌ అందించనున్నట్లు తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడంతో పాటు పట్టణంలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. మాదన్నపేట చెరువు మినీట్యాంక్‌ బండ్‌ నిర్మాణానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10కోట్ల నిధులు కేటాయిస్తే టెండర్‌ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆ పనులు నేటికి పూర్తి చేయలేదన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేటలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 24 మంది కచ్చితంగా గెలుస్తారన్నారు. అభివృద్ధిని పట్టణ ప్రజలు రుచి చూశారని, ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనదేనన్నారు. ప్రతి వార్డులో అధికార పార్టీ కౌన్సిలర్‌ ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. నర్సంపేటకు రూ. 200కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్‌గౌడ్‌, డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, గుంటి కిషన్‌, పుట్టపాక కుమారస్వామి, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్‌, నల్లా సుధాకర్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Related Stories:

More