నేటి నుంచి పల్స్‌ పోలియో

-ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయించొచ్చు.. -ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. -20వ తేదీన ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు -21వ తేదీన తప్పిపోయిన చిన్నారులకు.. -జిల్లావ్యాప్తంగా 75,587 మంది పిల్లలకు చుక్కల మందు మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఈ నెల 19న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు 75,587 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. 59 రూట్లలో 616 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. 24 మొబైల్‌ టీమ్స్‌ ద్వారా పిల్లలకు పోలి యో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ముందు నుంచే జిల్లా వ్యాప్తం గా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు కేంద్రాల్లో చుక్కలు వేస్తారు. 20న ఇంటింటికీ తిరిగి పోలి యో చుక్కలు వేయనున్నారు. 21న తప్పిపోయిన చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. జిల్లా మొత్తంలో 8,08,049 జనాభా ఉండగా ఇందులో ఐదేళ్ల లోపు 75,587 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. వీరికి 5163 వాయిల్స్‌(డోస్‌లు) అవసరం ఉంది. కాగా వీరిలో 56 వలసదారుల ఆవాస ప్రాంతాలున్నాయని, వారి లో 1090 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. మానిటరింగ్‌ అధికారులుగా లక్షెట్టిపేట క్లస్టర్‌కు డాక్టర్‌ పవన్‌, చెన్నూర్‌కు డాక్టర్‌ సత్యనారాయణ, బెల్లంపల్లికి డాక్టర్‌ బాలాజీ, మంచిర్యాల క్లస్టర్‌కు డాక్టర్‌ రవి వ్యవహరించనున్నారు. నాలుగు అర్బన్‌ ఏరియాల్లో (పాత మంచిర్యాల, రాజీవ్‌ నగర్‌, దీపక్‌నగర్‌, శంషీర్‌ నగర్‌), నాలుగు ట్రైబల్‌ ఏరియాల్లో (కాసిపేట పీహెచ్‌సీ, దండేపల్లి పీహెచ్‌సీ, తాళ్లపేట పీహెచ్‌సీ, మందమర్రి పీహెచ్‌సీ)తో పాటు రూర ల్‌ ఏరియా పీహెచ్‌సీ (హాజీపూర్‌, నస్పూర్‌, జైపూర్‌, కుందారం, వెంకట్రావుపేట, జన్నారం, కోటపల్లి, అంగ్రాజ్‌పల్లి, వేమనపల్లి, తాండూరు, భీమిని, నెన్నెల, తాళ్లగురిజాల)ల పరిధిలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు మానిటరింగ్‌ అధికారులు, 21 మంది మెడికల్‌ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఎక్కడెక్కడ వేయించుకోవచ్చు... పోలింగ్‌ కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్‌ హోంలు, అంగన్‌వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్లే స్కూళ్లు, గార్డెన్లు, పార్కులు, ఫంక్షన్‌ హాళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, సమావేశ హాళ్లు, ప్రధాన కూడళ్ల వద్ద చుక్కల మందు వేయించవచ్చు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ట్రాన్సిట్‌ టీంలు పోలీయో చుక్కలు వేయనున్నారు.
More