టీఆర్‌ఎస్‌లో 80మంది చేరిక నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు

సీసీసీ నస్పూర్‌ : అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి వెల్లువలా వస్తున్నారని నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు అన్నారు. శనివారం నస్పూర్‌ 21వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎంబడి కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సందీప్‌రావుతో పాటు మరో 80మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికి విజిత్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 21వ వార్డులో ఒక మంచి వ్యక్తి ఎంబడి కుమారస్వామికి టికెట్‌ ఇచ్చామని, అందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తిప్పని రామయ్య, నాయకులు ముత్తె రాజేశం, ముక్కెర వెంకటేశం, బాకం నగేశ్‌, అక్కూరి సుబ్బయ్య, నల్లపు శ్రీనివాస్‌, తిప్పని తిరుపతి పాల్గొన్నారు.
More