మంత్రి ఎర్రబెల్లి నివాసంలో సినీ తారల సందడి

పర్వతగిరి : మండల కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వగృహానికి సినీ హీరో మహేశ్‌బాబు, విజయశాంతి, దిల్‌రాజు, రష్మిక శుక్రవారం రాత్రి వచ్చారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్ర సక్సెస్‌ మీట్‌ కార్యక్రమానికి హన్మకొండకు వచ్చిన నేపథ్యంలో రాత్రి పర్వతగిరి లోని ఎర్రబెల్లి స్వగృహానికి సినీ హీరో మహేశ్‌బాబు, విజయశాంతి, దిల్‌రాజు, రశ్మిక వచ్చి ఆతిథ్యం స్వీకరించి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి దయాకర్‌రావుతో పాటుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మంత్రి దయాకర్‌రావు సతీమణి ఉషాదయాకర్‌రావు, భాస్కర్‌రావు, జెడ్పీటీసీ బానోతు సింగ్‌లాల్‌, సోమేశ్వర్‌రావు, మాడ్గుల రాజు, గోనె సంపత్‌, కంటె ఏకాంతం, వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు.

Related Stories:

More