తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే చర్యలు తప్పవు

మంచిర్యాల అగ్రికల్చర్ (హాజీపూర్ ) : హాజీపూర్ మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ప్రత్యేక అధికారులు విద్యుత్ శాఖకు సంబంధించి పనులు జరుగకున్నా జరిగినట్లు సర్టిఫికెట్లు అందజేస్తే వారిపై చర్యలు తప్పవని హాజీపూర్ ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, ఎంపీడీవో అహ్మద్ హై శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడో విద్యుత్ లైన్ లాగడం, ప్రధాన లైనుల్లో కొత్త సంభాల ఏర్పాటు, ఇనుప స్తంభాలను మార్చడం, మీటర్లను బిగించడం, లూజ్ వైర్లను లాగడం, బల్బులు ఏర్పాటు తదితర పనులకు సంబంధించి జరిగిన పనులకు మాత్రమే సర్టిఫికెట్లపై సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. పనులు పూర్తి కాకుండానే అయినట్లు రిసీవ్డ్ కాపీ ఇస్తే, చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

Related Stories:

More