రవెన్యూ అధికారులకు రక్షణ కల్పిస్తాం

లక్షెట్టిపేట : తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు పోలీసు రక్షణ కల్పిస్తామని సీఐ నారాయణ్ నాయక్ పేర్కొన్నారు. శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడారు. విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. కార్యాలయంలో పోలీసు కానిస్టేబుల్‌తో పాటు బ్లూకోట్ సిబ్బంది కార్యాలయ పరిసరాల్లో ఎప్పుడూ నిఘా ఉంచుతారని తెలిపారు. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానస్పద వ్యక్తుల ఎవరైనా సంచరించిన, కార్యాలయానికి వచ్చే వ్యక్తులు ప్రమాదకర ఆయుధాలు,పెట్రోల్ లాంటి తీసుకువస్తే కఠిన చర్యలుంటాయని వివరించారు. తాసిల్దార్ కార్యాలయంలో సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ నర్సయ్య, డీటీ హరిత, ఆర్‌ఐ స్వప్న, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల అగ్రికల్చర్(హాజీపూర్) : హాజీపూర్ మండలంలోని రెవెన్యూ కార్యాలయానికి పోలీసు భద్రత కల్పించారు. కార్యాలయానికి ఎస్‌ఐ చంద్ర శేఖర్ వచ్చి పరిశీలించారు. రెవెన్యూ సిబ్బంది పని చేసే స్థలం, ప్రజావాణి నిర్వహించే స్థలం గురించి తాసిల్దార్ జమీర్ అహ్మద్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చే వారిని ముందస్తుగా గమనించాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే బయటనే ఆపి వేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

Related Stories:

More