పరిశుభ్రత పాటించండి

జైపూర్: పరిశుభ్రతపై పట్టింపు లేకుంటే ఎలా అంటూ కలెక్టర్ భారతి హోళికేరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిష్టాపూర్, జైపూర్‌లో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం పై అసహనం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో తాను రెండు సార్లు పీహెచ్‌సీ సందర్శించి న విషయాన్ని గుర్తు చేశా రు. ముందు అధికారులు పాటిస్తే ప్రజలు పాటిస్తారన్నారు. అనంత రం దవాఖాన లోపలి పరిసరాలు పరిశీలించా రు. ఓపీ వివరాలడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ నాగేశ్వర్‌రెడ్డి, ఈఓపీఆర్‌డీ సతీశ్‌తో పాటు వైద్యురాలు క్రిష్ణవేణి పాల్గొన్నారు.

Related Stories:

More