రైతులకు ఇబ్బంది కలిగించొద్దు.

జైపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహ కులు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించా రు. కిష్టాపూర్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని శనివారం సందర్శించారు. కేంద్రంలో ఆరబోసిన వరి ధాన్యం నాణ్యతను పరిశీలించారు. నిర్వాహకులతో తేమ శాతాన్ని పరిశీలించి 25 మాయశ్చర్ (తేమ శాతం)తో ఎందుకు పంటలు కోస్తున్నారని రైతులను అడిగారు. 17 వరకు తేమశాతం ఉంటేనే మంచి నాణ్యత ఉంటుందని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వరి పంటలు నేలవాలడంతో ముందుగా కోసినట్లు రైతులు కలెక్టర్‌కు వివరించారు. తమకు ఆరబెట్టుకునేందుకు స్థలం కావాలని కోరారు. మొత్తం జిల్లాలో 130 కేంద్రాలు ఏర్పా టు చేశామని అందరికీ స్థలం కావలంటే కుదరదని ఆమె చె ప్పారు. అవకాశమున్న కేంద్రాల వద్ద రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలన్నారు. ఎకరాకు 10 బస్తాల దిగుబడి తగ్గిందని రైతులు వివరించారు. పంట నష్టపరిహరం అందించాలని కోరారు. క్రాప్ రుణాలు ఉన్నవారు ఇన్సూరెన్స్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు దగ్గరపడుతుందని తెలిపారు. తాసిల్దార్ సంతోష్‌రెడ్డి, స ర్పంచ్ పద్మ, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రమేశ్, నాయకులు పాపిరెడ్డి పాల్గొన్నారు.

Related Stories:

More