గ్రామాల అభివృద్ధే ధ్యేయం..

-ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు.. -శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హల్‌చల్.. -ఉత్సాహంలో టీఆర్‌ఎస్ శ్రేణులు.. -టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు చెన్నూర్ రూరల్ : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మండలంలోని అక్కెపల్లి, సోమన్‌పల్లిలో శుక్రవారం వైకుంఠధామాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడా రు. గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికతో పాటు రెండు పడకల గదుల ఇండ్లు, బోరుబావి ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతీ పంచాయతీకి ఎమ్మెల్యే కోటా నుంచి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైకుంఠధామాల ఏర్పాటుకు పలు గ్రామాల్లో భూదానం చేసిన వారిని అభినందించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎంపీడీవో మల్లేశం, ఈజీఎస్ ఏపీవో గంగాభవానికి సూచించారు. కార్యక్రమం లో డీఆర్డీఓ శేషాద్రి, తాసిల్దార్ పుష్పలత, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపు రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్ రెడ్డి, సర్పంచులు పెద్దింటి స్వరూప, శారద, మాజీ జడ్పీటీసీ కరుణాసాగర్ రావు, టీఆర్‌ఎస్ నాయకులు రేవెల్లి మహేశ్, పెద్దింటి రాజన్న, భీమిని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి జైపూర్: ధాన్యం కొలుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వవిప్ బాల్క సుమన్ అన్నారు. మండలంలోని శివ్వారం, పౌనూర్, వేలాల, ఇందారంలో శుక్రవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 11 నెలల కాలంలో నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 6.80కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని 320 చెరువులకు అనుసంధానం చేసి నిరంతరం సాగునీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేలాల గోదారి సమీపంలో 10లక్షల ఈజీఎస్ నిధులతో శ్మశాన వాటిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. మల్లికార్జు స్వామి ఆలయ ప్రహరీగోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేలాలకు వచ్చిన సుమన్‌కు ఆలయ ఈఓ రమేష్‌తో పాటు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది శాలువాలతో సన్మానించారు. వేలాల గ్రామలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జైపూర్ ఏసీపీ నరేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఇందారంలో మత్స్యశాఖ భవనం ప్రారంభం ఇందారంలో నిర్మించిన మత్స్యశాఖ భవనాన్ని స్థానిక నాయకులు, మత్స్యశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఇందారం-టేకుమట్ల గ్రామాల మధ్యలో గల సింగరేణి స్థలం 35 ఎకరాల్లో కమ్యూనిటీ భవనంతో పాటు, స్టేడియం నిర్మాణం చేపట్టేందుకు సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో చర్చించినట్లు తెలిపారు. ఇందారం గోదారి సమీపంలో కిలోమీటరు మేర కరకట్ట నిర్మాణం చేసి ట్యాంక్‌బండ్ తరహలో అభివృద్ది చేసయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ శేషాద్రి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఏసీపీ నరేందర్, ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ మేడి సునీత, వైస్ ఎంపీపీ పెద్దపెల్లి రమేష్, సర్పంచులు, ఎంపీటీసీలు గణేశ్, రాజేశ్వరి, ప్యాగ శ్యామల, గడ్డం మంజుల, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అరవింద రావు, కోఆప్షన్ జైనుద్దీన్, మేడి తిరుపతి, గోదారి లక్ష్మణ్‌లతో పాటు మత్స్య కారుల సంఘం నాయకులు తొగరి శ్రీనివాస్, గోపాల్, సాయికృష్ణ పాల్గొన్నారు.

Related Stories:

More