ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

రామకృష్ణాపూర్ : పట్టణంలోని 22 వార్డు కుర్మపల్లిలో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి టీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ భూమి లేని కారణంగా ట్యాంకు నిర్మాణం జాప్యమైనట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు కుర్మపల్లి గ్రామస్తులతో మాట్లాడగా కడారి ఎల్లయ్య అనే రైతు ట్యాంక్ నిర్మాణానికి భూమి ఇచ్చేందుకు ముందుకు రావడంతో భూమి పూజ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూదానం చేసిన రైతు కడారి ఎల్లయ్యను గ్రామస్తులు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అభినందించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, మాజీ జడ్పీటీసీ కంభగోని సుదర్శన్‌గౌడ్, గ్రామ యువనాయకులు వేనంక శ్రీనివాస్, దొడ్డి శ్యామ్, పనాస రాజు, వేనంక శివలింగు, బైరా కొమరవెల్లి, కడారి కుమార స్వామి, డొడ్డి చంద్రయ్య,అందుగుల మల్లేశ్, కుమార్, ఏనుగుల ప్రశాంత్, బండ శ్రీనివాస్, కడారి సాయి పాల్గొన్నారు.

Related Stories:

More