గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం

చెన్నూర్ రూరల్ (కోటపల్లి): రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడమే ప్ర భుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మండలంలోని ఆస్నాద్, సోమన్‌పల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ గతంలో పంటలు పండక, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు లేవన్నారు. మద్దతు ధర ఏ గ్రేడ్ రూ. 1835. కామన్ గ్రేడ్ ధర రూ. 1815 ఉంటుందని తెలిపారు. రైతులు నాణ్యమైన వడ్లను, తేమ శాతం 17కు మించకుండా తే వాలన్నారు. ఎంపీ పీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపు రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మల్లెల దామోదర్ రెడ్డి, చెన్నూర్ ఎంపీ డీవో మల్లేశం, తాసిల్దార్ పుష్పలత, డీఆర్‌ఎడీవో శేషాద్రి, ఈ జీఎస్ ఏపీవో గంగా భవాని సర్పంచులు మా డ సుమలత, ఏలేశ్వరం నాగభూషణం చారి, ఎంపీటీసీలు వసంత, లావణ్య, ఉప స ర్పంచ్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కరుణాసాగర్ రావు, టీఆర్‌ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, నరసింహచారి, తిరుపతి రెడ్డి ఉన్నారు.

Related Stories:

More