శిక్షణను వినియోగించుకోవాలి
మంచిర్యాల స్పోర్ట్స్: శిక్షణలో సూ చించిన అంశాలను తరగతి గదుల్లో వినియోగించాలని డీఈవో కార్యాలయ సెక్టోరల్ అధికారి శ్రీనివాస్ సూచించా రు. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో జిల్లా విద్యా శాఖ తెలంగాణ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విలీన విద్య పాఠ్య ప్రణాళిక అనుకూలతలపై ఉపాధ్యాయులకు ఇస్తున్న రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యా యి. ఆయన పర్యవేక్షణలో జరిగిన ఈ శిక్షణ తరగతుల్లో జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు ఒక్కొక్క స్కూల్ కాంప్లెక్స్ నుంచి ఒక ఉపాధ్యాయుడు 50 మంది పాల్గొన్నా రు. శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠ్య ప్ర ణాళికల అనుకూలనలుపై ఉపాధ్యాయులకు శిక్షణ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు కొన సాగగా స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయు లు శిక్షణలో పాల్గొన్నారు.
More