సీఎం కేసీఆర్‌ పిలుపుతో..

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ పట్టణంలోని కైలాస్‌నగర్‌ కాలనీకి చెందిన టి.రవి 2014 మే5న కండక్టర్‌గా విధుల్లో చేరాడు. ఇతనికి భార్య వనజ, కుమారుడు రుషికేష్‌ ఉన్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌ డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. కార్మిక సంఘాల పిలుపు మేరకు గత నెల రోజులుగా సమ్మెలో ఉన్నాడు. కాగా.. రెండు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్మిక సంఘాల నాయకులు తమను తప్పదోవ పట్టిస్తున్నారని తెలుసుకొని, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు తాను విధుల్లో చేరినట్లు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపాడు. ఆసిఫాబాద్‌ డిపో పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఎం కార్యాలయంలో సమ్మతి పత్రాన్ని అందజేశాడు. తాను విధుల్లో చేరిన విషయం కార్మిక సంఘాల నాయకులకు తెలియడంతో బెదిరింపు కాల్స్‌ వస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయమై స్థానిక డీఎస్పీ కార్యాలయంలో కూడా రక్షణ కోసం ఫిర్యాదు చేశాడు. తనతోపాటు తోటి కార్మికులు కూడా విధుల్లో చేరాలని కోరాడు. ఉద్యమం కంటే తనకు భార్య, పిల్లలు తన కుటుంబమే ముఖ్యమని పేర్కొన్నాడు. జీతం లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తమ బాదలు ఎవరికి అర్థం కావడం లేదని యూనియన్‌ పెద్దలంతా మొండిగా సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు.

Related Stories:

More