పేదలకు ఆసరా సీఎం సహాయ నిధి

జన్నారం : సీఎం సహాయనిధి పేదలకు ఆసరాగా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పేర్కొన్నారు. జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన నారిబాయికి మంజూరైన రూ.1.25లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందనీ, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని కొనియాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులం దరూ వినియోగించుకోవాలని సూచించారు.

Related Stories:

More