ఎన్నికల నిర్వహణకు కృషి

మందమర్రి: గిరిజన చట్టం అమలుతో నిలిచిపోయిన మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు కృషి చేస్తానని విప్ బాల్క సుమన్ అన్నారు. రూ. 2 కోట్ల 29 లక్షల 63 వేలతో నిర్మించనున్న ఊరు మందమర్రి, ఎర్రగుంటపల్లి, రైల్వే స్టేషన్ రోడ్ల నిర్మాణానికి పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మితో కలసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పై కోర్డులోస్టే ఉండడంతో ఎన్నికలు నిలిచిపోయాయన్నారు. ఈ సమస్యను గతంలోనే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి తారకరామారావు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పాలకవర్గం ఉంటే తనకు కూడా కొంత భారం తగ్గుతుందన్నారు. జడ్పీ సభ్యుడు సభ్యుడు వేల్పుల రవి, మున్సిపల్ కమిషనర్ బాపు, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల నాయకులు మేడిపల్లి సంపత్, యండీ అబ్బాస్, గుర్రం శ్రీనివాస్ గౌడ్, బండారు సూరిబాబు, తోట సురేందర్, మేడిపల్లి మల్లేశ్, భట్టు రాజ్‌కుమార్, మాసు వెంకటేశ్, దాసరి నవీన్, యండీ ముజాహిద్, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.

Related Stories:

More