మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా పరామర్శ

గీసుగొండ : మృతుల కుటుంబాలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం పరామర్శించారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వీరగోని రాజ్‌కుమార్ తల్లి వీరలక్ష్మి గీసుగొండలో ఆదివారం మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. కార్యకర్తల కుటుంబాలకు టీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. పరామర్శించిన వారి లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జెడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, గీసుగొండ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, పార్టీ మండల కార్యదర్శి పూండ్రు జైపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు గోపాల నవీన్‌రాజ్ ఉన్నారు. ధర్మారంలో కార్పొరేటర్ లింగం మౌనిక కుటుంబానికి.. గీసుగొండ : గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ కార్పొరేటర్ లింగం మౌనిక అత్త లింగం పద్మ ఇటీవల మృతి చెందింది. మౌనిక కుటుంబాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం ధర్మారంలో పరామర్శించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు సుంకరి శివ, నవీన్‌రాజు, విజయ్‌బాబు, నాగరాజు పాల్గొన్నారు. కటాక్షపూర్‌లో.. ఆత్మకూరు : కటాక్షపూర్‌కు చెందిన ఎక్కటి సంజీవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, జిల్లా నాయకులు దుంపలపల్లి బుచ్చిరెడ్డి, సర్పంచ్ మచ్చిక యాదగిరి, రబీయాబీహుస్సేన్, గురిజాల ప్రకాశ్‌రావు, గుండెబోయిన బాలకృష్ణ, నాయకులు ఉన్నారు.

Related Stories:

More