అమ్మవారికి మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు

పర్వతగిరి, అక్టోబరు 07: మండల కేంద్రంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా దేవి అమ్మ వారికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉషా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దయాకర్‌రావు కుమారుడు ప్రేమ్‌చందర్‌రావు దంపతులు, ఇతర కుటుంబసబ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా ఏటా ఇక్కడికి వస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్వగ్రామంలో ఉత్సవాల్లో పాల్గొనడం తమకు ఎంతో ఇష్టమన్నారు.

Related Stories:

More