ఎన్పీడీసీఎల్‌లో దుర్గామాత పూజ

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం దుర్గామాత పూజలు ఘనంగా నిర్వహించారు. సంస్థ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావుతో పాటు డైరెక్టర్లు గణపతి, నర్సింగారావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వేణుగోపాల స్వామి, శ్రీకాంతాచారి, శ్రీవాత్సవాచార్యులు, సీజీఎంలు అశోక్ కుమార్, తిరుపతి రెడ్డి, మధుసూదన్, కిషన్, మోహన్‌రావు, ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ వెంకటేశం, జీఎంలు గిరిధర్, శ్రీనివాస్, వెంకటకృష్ణ, దేవేందర్, గౌతంరెడ్డి, వేణు బాబు, శ్రీకృష్ణ, నాగప్రసాద్, సత్యనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు.

Related Stories:

More