మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన బతుకమ్మ

ఖానాపురం,అక్టోబర్06: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటింది బతుకమ్మ పండగేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖానాపురం శివారు తుంగబంధం కాలువ వద్ద దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావుతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ అందరూ సుభిక్షంగా సుఖసంతోషాలతో బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతీ ఆడపడుచుకు బతుకమ్మ చీరలను అందించారన్నారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ పండుగలకు ప్రాచుర్యం లభించిందన్నారు. తెలంగాణ సంస్కృతిని చూసి దేశం మొత్తం గర్వపడుతోందన్నారు. పాకాలకు గోదావరి జలాలు వచ్చే శుభగడియలు దగ్గరోనే ఉన్నాయన్నారు. అనంతరం విగ్రహదాతలు దేవినేని వేణుకృష్ణ, గంగాపురం రమేశ్, మచ్చిక అశోక్‌ను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాఖమూరి చిరంజీవి, ఎంపీటీసీలు బోఢ భారతి, మర్రి కవిత, కోఆప్షన్ సభ్యులు కొలిశెట్టి పూర్ణచందర్‌రావు, మల్యాల పోశెట్టి, కిరణ్, సునీత, కుమార్, బొప్పిడి పూర్ణచందర్‌రావు పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలో.. దుగ్గొండి : మండలంలోని చలపర్తి, తిమ్మంపేట, గోపాలపురం, తొగర్రాయి గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులుఆవిష్కరించారు. గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రజలు సంతోషంగా బతుకమ్మను ఆడుతున్నారన్నారు. ప్రజలు కోరుకున్నట్లుగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తోందన్నారు. అలాగే, మండలంలోని తొగర్రాయిలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంబించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, సర్పంచ్‌లు ఓడేటి తిరుపతిరెడ్డి, నీలం పైడయ్య, మోడెం విద్యాసాగర్‌గౌడ్, ముదురుకోల కృష్ణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Related Stories:

More