కాళేశ్వరం ఆలయ ధర్మకర్తగా శ్రీనివాస్

వరంగల్ చౌరస్తా : తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తీశ్వరాలయాని కి ధర్మకర్తగా భవితశ్రీ చిట్‌ఫండ్స్ ఎండీ తాటిపెల్లి శ్రీనివాస్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్యాల వీరమల్లయ్య, సభ్యులు పా ల మదన్‌మోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఆ ర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు తొనుపునూరి వీరన్న పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాళేశ్వరం ముక్తీశ్వరాలయ ధర్మకర్తగా నియమించిన ము ఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

Related Stories:

More