రూపాలు వేరైనా అమ్మ ఒక్కరే..

అర్బన్ కలెక్టరేట్ : దేవీ శరన్నవరాత్రుల్లో భా గంగా భక్తులు అమ్మవారిని వివిధ అవతారాల్లో .. రూపాల్లో పూజిస్తున్నప్పటికీ సమస్థ లోకాలను మానవాళిని రక్షిస్తూ ప్రకృతిని కాపాడుతున్న జగన్మాత ఆదిపరాశక్తి ఒక్కరేనని విశాఖ శ్రీశారదా పీ ఠం ఉత్తర అధికారి స్వాత్మానంద్రేంద్రస్వామి అ న్నారు. హన్మకొండ హంటర్‌రోడ్డులోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వి నయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ యాదవరెడ్డి, కరీంనగర్ సుడా చైర్మన్ రామకృష్ణారావు హాజరై స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి రుద్రాభిషేకం నిర్వహించడంతో పాటు మంత్రపఠనం, చండీపారాయణం, చండీ హోమం జరిపించారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతారా వు దంపతులు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ దంపతు లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామి మాట్లాడుతూ నవరాత్రి మనిషిలోని అహాన్ని దహించి వేస్తుందని, దేవతలను సైతం వేధిస్తున్న రాక్షసులను అమ్మ వివిధ రూపాలెత్తి వధించిందన్నారు.

Related Stories:

More