దుర్గా అలంకరణలో భద్రకాళీc

-అమ్మవారిని దర్శించుకున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మట్టెవాడ, అక్టోబర్ 06: నగరంలోని భద్రకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. భద్రకాళీ జన్మదినోత్సవమైన మహా ష్టమి (దుర్గాష్టమి) సందర్భంగా అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాష్టమి రోజు అమ్మవారిని దర్శించుకుని, ఆరాదిస్తే కష్టాలు దరి చేరవని ఆలయ ప్రధానార్చకులు భద్రకాళీ శేషు అన్నారు. ఈసందర్భంగా అమ్మవా రిని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు వారికి ఆలయ ఈవో ఆర్ సునీతతోపాటు సిబ్బంది, ఆలయ ప్రధానార్చకులు భద్రకాళీ శేషు, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మహామండపం లో వేద పండితులు, అర్చకులు వారికి అమ్మవారి శేష వస్త్రాలను బహూకరించి మ హదాశీర్వచనం నిర్వహించి ప్రసాదాలను అందజేశారు. ఉభయ దాతలుగా ఇరుకుళ్ల సంజయ్-జయశ్రీ, కుందూరు అనిల్‌రెడ్డి-అనిత, జ్యోశ్యుల కామేశ్వరశర్మ-కిరణ్మ యి దంపతులు వ్యవహరించారు. సాయంత్రం భద్రకాళీ ప్రాంగణంలో మహిళలు పెద్ద సంఖ్యలో సద్దుల బతుకమ్మ ఆడారు.

Related Stories:

More