పల్లె సమస్యలు పరిష్కారం

-సత్ఫలితాలిచ్చిన 30రోజుల కార్యాచరణ ప్రణాళిక -అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి -గ్రామసభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట, నమస్తేతెలంగాణ : ము ప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికతో పల్లె సమస్యలు పరిష్కారమవుతున్నాయని, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. శనివారం నల్లబెల్లి మండలంలోని నందిగామ, రేలకుంట గ్రామాలకు సంబంధించిన ముప్పై రోజు ల కార్యాచరణ ప్రణాళికల ముగింపు గ్రామ సభను నందిగామలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పెద్ది పాల్గొని మాట్లాడారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారమయ్యాయన్నారు. వీటిని 30 రోజులకే పరిమితం చేయకుండా కొనసాగించాలని సూచించారు. అప్పుడే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. అలా గే, దేవాదుల నీటిని త్వరలో నందిగా మ, రేలకుంట గ్రామాలకు తీసుకువచ్చి రెండు పంటలకు అందిస్తామన్నారు. కాగా, రేలకుంటకు చెందిన దివ్యాంగురాలు మూడు రజితకు ఎన్‌పీఆర్‌డీ ఇండియా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీల్‌చైర్‌ను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, ఎంపీపీ ఊడ్గుల సునీత, ప్రవీణ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంక ర్, ఎంపీవో ప్రకాశ్, సర్పంచ్‌లు సలేం ద్ర, రత్నాకర్‌రావు పాల్గొన్నారు. పెద్దిని కలిసిన ఎంపీటీసీలు చెన్నారావుపేట : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని మండలంలోని ఎం పీటీసీలు ఆయన క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యేకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని గ్రామాలకు ప్రత్యేక నిధులను మంజూరు చేయించి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరా రు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చెరుకుపెల్లి విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు పసునూటి రమేశ్, గుండాల మహేందర్, ధారావతు శ్రీను, కడారి సునీత, సాయిలు, పర్కాల లక్ష్మి, రాజన్న పాల్గొన్నారు. బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ నర్సంపేట రూరల్ : తెలంగాణ సం స్కృతీ, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కమ్మపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలుత మహిళలు ఎమ్మెల్యే పెద్దికి బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. విగ్రహా న్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జెడ్పీటీసీ కోమాండ్ల జయ, మాజీ ఎంపీ పీ నల్లా మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మా జీ చైర్మన్ నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, సర్పంచ్‌లు రేమిడి రాజిరెడ్డి, వల్గుబెల్లి రంగారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, వల్లాల కర్ణాకర్‌గౌడ్, తుమ్మ నాగయ్య, ఐలోని, గణపతిరెడ్డి, అనిల్, చంటి, రాజిరెడ్డి, బుచ్చిరెడ్డి, చిన్న ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్, భిక్షపతి, కృష్ణ, మాధవరెడ్డి పాల్గొన్నారు.

Related Stories:

More