కనుల పండువగా కల్యాణోత్సవం

-పరిణయ పట్టు వస్ర్తాలతో భక్తకోటికి దర్శనమిచ్చిన ధర్మగడ్డ శ్రీనివాసుడు రాయపర్తి, అక్టోబర్ 05 : ప్రతీ ఏడు సద్దుల బతుకమ్మ పర్వదినానికి ఒక్కరోజు ముందుగా నిర్వహించుకునే మండలంలోని ఊకల్ గ్రామ శివారు, బాలాజీ తండా గ్రామపంచాయతీ పరిదిలోని ధర్మగడ్డ శ్రీనివాసుడి కల్యాణోత్సవం శనివారం కన్నుల పండువగా సాగింది. ప్రతీ ఏడు సద్దుల బతుకమ్మ వేడుకలలో భాగంగా దుర్గాష్టమికి ముందు బాలాజీతండా సమీపంలో సుమారు 50 ఏళ్ల క్రితం స్వయంవ్యక్తగా వెలిసిన శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో భాగంగా గ్రామానికి చెందిన స్వామి వారి భక్తుడు రావుల నవీన్‌రెడ్డి దంపతుల సారథ్యంలో ప్రతీ ఏడు అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ స్వామి వారికి పద్మావతి, అలివేలు మంగమ్మలతో పరిణయ తంతు నిర్వహించడం సంప్రాదాయం. శనివారం ఊకల్ గ్రామ సర్పంచ్ కుంచారపు హరినాథ్, ఆలయ అనువంశిక పూజారులు వెన్నం కృష్ణమూర్తి, రామ్మూర్తి నేతృత్వంలో కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలలో గ్రామ ఎంపీటీసీ నార్లాపురం రాజు, పెద్దలు లెక్కల నారాయణరెడ్డి, గొల్లపల్లి సదాశ్రీను, పాము మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories:

More