సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

పరకాల, నమస్తే తెలంగాణ : ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్ సూచించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని ప్రముఖ వైద్యులంతా కలిసి నడికూడ మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో శనివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రామాల్లో ప్రబలుతున్న విషజ్వరాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నందున కలెక్టర్ ఆదేశానుసారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తోపాటు వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మేరకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు, వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. రెడ్‌క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో దోమలను నివారించాలన్నారు. శిబిరంలో ప్రముఖ వైద్యులు నాగబండి విద్యాసాగర్, పింగిళి విజయపాల్‌రెడ్డి, సామ్యేల్, సురేశ్‌చంద్ర, విద్యాసాగర్‌రెడ్డి, మధూకర్‌రెడ్డి, రజనీకాంత్, అభినందన్‌రెడ్డి తదితరులు పాల్గొని 600 మందికి వైద్యసేవలను అందించారు. అనంతరం ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బొట్ల సంధ్య రవీందర్, కోడూరు మల్లేశం పాల్గొన్నారు.

Related Stories:

More