బంతి పూలకు భలే గిరాకీ

చెన్నారావుపేట : బతుకమ్మ అంటేనే పూలు. ఈ పండుగ రోజున వాటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ధర ఎంతైనా సరే.. పూలు కొనాల్సిందే.. బతుకమ్మ పేర్వాల్సిందే.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రస్తుతం బంతి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలోకు రూ.100 నుంచి 120 వరకు ధర పలుకుతోంది. అయినా మహిళలు, స్థానికులు కిలోల కొద్ది బంతిపూలను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. గతేడాది కిలో రూ.50 నుంచి 80 వరకు అమ్మకాలు చేపట్టగా ఈ ఏడాది అమాంతం రెట్టింపు చేశారు. తంగేడు, గునుగు పూలు దొరకక పోవడంతో బంతి పూలకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

Related Stories:

More