గంగదేవిపల్లిలో సివిల్ సర్వీస్ అధికారుల బృందం

గీసుగొండ, అక్టోబర్ 05 : ఆదర్శ గ్రామం గంగదేవిపల్లికి శిక్షణ నిమిత్తం వచ్చిన కేంద్ర సివిల్ సర్వీసు అధికారుల బృందం చివరి రోజు శనివారం స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించింది. సంఘాల ఆర్థిక స్థితిగతులు, పొదుపు, రుణాలు తీసుకునే విధానాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యూస్ పేపర్లతో క్యారీ బ్యాగులు తయారు చేసే విధానంపై వారు సంఘం సభ్యులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం గంగదేవిపల్లి గ్రామాభివృద్ధిలో కమిటీ భాగస్వామ్యం గురించి సర్పంచ్ గోనె మల్లారెడ్డి వివరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి అర్జున్, కార్యదర్శి అశ్విని పాల్గొన్నారు.

Related Stories:

More