సరస్వతీదేవి అవతారంలో దుర్గాదేవి

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా వర్ధన్నపేట మండంలోని ఇల్లంద, చెన్నారం, వర్ధన్నపేట పట్టణాలలో దేవీ నవరాత్రో త్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. శనివారం దుర్గాదేవీ సరస్వతీ మాత అవతారంలో దర్శనమిచ్చారు. శాయంపేట మండల కేంద్రంలోని ఎస్‌పీటీ యూత్ వద్ద దుర్గామాత సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో దుర్గామాత కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. పలు మండపాల వద్ద చండీహోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో కొలువుదీరిన దుర్గ అమ్మవారికి నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో శనివారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. చెన్నారావుపేట మం డల కేంద్రంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలోని అమ్మవారు శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా శనివారం సరస్వతీ మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది.

Related Stories:

More