మేడ్చల్‌లో విజయవంతంగా జలశక్తి అభియాన్

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో జలశక్తి అభియాన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది. 2019 జులై 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనున్నది. ఈ పథకం కింద మేడ్చల్ జిల్లాలో మొత్తం 7 మండలాలు (మేడ్చల్, ఉప్పల్, మల్కాజగిరి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్‌పల్లి, కాప్రా, బాచుపల్లి) ఎంపికయ్యాయి. ఇందులో మేడ్చల్ గ్రామీణ మండలం కాగా మిగిలిన ఏడు మం డలాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఈక్రమంలోనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ మండలమైన మేడ్చల్‌లోని గ్రామాల్లో 200 ఇంకుడు గంతలను నిర్మించడంతోపాటు 10 ఫాంపాండ్లను ఏర్పాటు చేశామని డీఆర్‌డీఓ కౌటిల్య తెలిపారు. ఇందులో ప్రధానంగా ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు వాటర్‌షెడ్‌ల నిర్మాణం, రీ స్టోరేషన్ ఆఫ్ లేక్స్, ప్లాంటేషన్, బోరుబావుల రీస్టోరేషన్ వంటి కార్యాక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని మిగిలిన ఏడు మండలాల పరిధిలో జీహెచ్‌ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపడుతారని, భూగ ర్భ జలాలను వృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఇండ్ల వంద్ద ఇంకుడుగుంతలు లేని వారు వెం టనే ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని డీఆర్‌డీఓ తెలిపారు.

Related Stories:

More