నాలుగైదు రోజుల్లో డ్రైనేజీ పనులు పూర్తి

హయత్‌నగర్ : హయత్‌నగర్ డివిజన్ పరిధి విజయవాడ జాతీయ రహదారి పక్కన బావర్చి ఎదురుగా ఉన్న డ్రైనేజీ ట్రంక్‌లైన్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి చొరవతో మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. వాతావరణం అనుకూలిస్తే నాలుగైదు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 1996లో బీఎన్‌రెడ్డి, వనస్థలిపురం, హయత్‌నగర్ డివిజన్ల కాలనీల డ్రైనేజీ నీటిని తరలించేందుకు 1200ఎంఎం సైజ్‌తో ప్రధాన డ్రైనేజీ ట్రంక్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ నాసిరకం పైపులు వాడటం వల్లే పైపులు శిథిలావస్థకు చేరుకొని మ్యాన్‌హోల్ వద్ద కుంగిపోయిందని కార్పొరేటర్ తెలిపారు. ఎల్బీనగర్ జోన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శంకర్‌లాల్, హయత్‌నగర్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీందర్, అసిస్టెంట్ ఇంజినీర్ విజయేందర్‌రెడ్డి శుక్రవారం కుంగిపోయిన డ్రైనేజీ ట్రంక్‌లైన్‌ను పరిశీలించారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, మాన్‌సూన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories:

More