దుండిగల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తనిఖీ

పేట్‌బషీరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు అందుబాటులో ఉంటున్నారా..? లేదా ?అని రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణతో పాటు దుండిగల్‌లో సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకేంద్రంలో రాత్రి సమయంలో ఒక ఏఎన్‌ఎంతో పాటు హెల్పర్ అందుబాటులో ఉండాలన్నారు. దుండిగల్ బస్టాండ్‌లో మూత్రశాలలు కట్టించాలని, ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని, మోరీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలిగించి, మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం పారిశుధ్య వ్యవస్థ సరిగాలేదని సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ మధుసూదన్, దుండిగల్ కమిషనర్ సురేశ్, జిల్లా వైద్యాధికారి డా.నారాయణ, డా. ఆనంద్, మెడికల్ ఆఫీసర్ డా.నిర్మల పాల్గొన్నారు.

Related Stories:

More