హెల్ప్‌లైన్ ద్వారా ఓటు సరిచూసుకోవాలి

సీసీసీ నస్పూర్ : ప్రతి ఓటరు తమ ఓటు వివరాలను హెల్ప్‌లైన్ ద్వారా సరిచూసుకోవాలని నస్పూర్ తాసీల్దార్ సయ్యద్ ముబీన్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఎలక్ట్రికల్ వెరిఫికేషన్ ప్రోగ్రాం(ఈవీపీ)లో భాగంగా ఓటరు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి ఆయన నస్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో మీ సేవా కేంద్రాల యజమానులు, చౌకధరల దుకాణం డీలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవా కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఓటు వివరాలు స్పష్టంగా తెలుపాలన్నారు. సరుకుల కోసం రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారులకు ఈవీపీ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఓటరు లిస్టులో తప్పుల నివారణకు కృషి చేయాలన్నా రు. ఈ సమావేశంలో డీటీ సంతోష్, ఆర్‌ఐ మాధవి, వీఆర్‌ఓ వెంకటేష్, మండలంలోని రేషన్ డీలర్లు, మీ సేవా సెంటర్ల నిర్వాహకులున్నారు.

Related Stories:

More